Tuesday 4 December 2012

ఇదేనా మనం ....!

 కాస్త  మారండి బాబు ....

హ్మ్మ్ ..టైటిల్ చూడగానే ఏదో తేడా కొడ్తూనే ఉంది  కదా...?
మీరు అనుకున్నది నిజమే..నిజంగానే కాస్త మారాలి సుమ మనం మరి.. 
మనం అని ఎందుకు అంటున్నానంటే   అందులో నేను కూడా  ఉన్నానని  నాకు కాస్త సందేహం మరి !
విషయనికోచేధం ..!సాధారణంగా బైక్ ల పైన మనమో లేక వేరే వాళ్ళో వెళ్తూనే ఉంటారు .
అంత వరకు బాగానే ఉంది.కాని ఎవర్తో వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో అని అవతలి వాళ్ళ గురించి మనకు ఎలా తెలుస్తుంది ..?తెలిదు కదా ...!
మరి అలాంటప్పుడు ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి బైక్ మిద వెళ్తున్నపుడు వాళ్ళ గురించి ఎందుకు తప్పుగా ఆలోచించాలి..? ఇలా అలోచంచడం ఎంత వరకు సరి అయినది ..?
అల జంటగా ఉన్నంత  మాత్రాన వారి గురించి మనం వాగడం అవసరమంటారా ..?
 సరదాగా అనుకునే మాటలు ఐన సరే అవి ఎంత చండాలంగా ఉంటాయో ఇక చెప్పాల్సిన  అవసరం లేదు అనుకుంటా ..?
అలా అనుకునే అప్పుడు మనం కూడా మన అక్క చేల్లెల్తోనో వెళ్తూ ఉంటె మన గురించి కూడా అవతలి వాళ్ళు  ఇలానే అనుకుంటారేమో అని ఇలా ఆలోచించడం తప్పు కదా అని ఒక్క సరి మన బుర్రలో తడితే చాలు అలా  అనుకోవడం ఎంత పాపమో మనకే తెలుస్తుంది..
వాళ్ళు ఉన్న చనువు తప్పుగా ఉంటే పరవాలేదు.. అనుకోండి మన దోల తీరేదాక ..!
కాని యెర్ర చీర కట్టిందల్ల నా పెళ్ళామే అని అన్నట్టు అలా  కలిసి ఉన్న అమ్మాయి అబ్బాయిలు అందరు అదే టైప్ అని మాత్రం అనుకోకండి సుమా.........!!!!!
నేను చెప్పింది సరి అయినదే అని అనుకుంటారని భావిస్తూ .......
                                                                        మీ
                                                                      చందు ... 

No comments:

Post a Comment