Tuesday 4 December 2012

ఇదేనా మనం ....!

 కాస్త  మారండి బాబు ....

హ్మ్మ్ ..టైటిల్ చూడగానే ఏదో తేడా కొడ్తూనే ఉంది  కదా...?
మీరు అనుకున్నది నిజమే..నిజంగానే కాస్త మారాలి సుమ మనం మరి.. 
మనం అని ఎందుకు అంటున్నానంటే   అందులో నేను కూడా  ఉన్నానని  నాకు కాస్త సందేహం మరి !
విషయనికోచేధం ..!సాధారణంగా బైక్ ల పైన మనమో లేక వేరే వాళ్ళో వెళ్తూనే ఉంటారు .
అంత వరకు బాగానే ఉంది.కాని ఎవర్తో వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో అని అవతలి వాళ్ళ గురించి మనకు ఎలా తెలుస్తుంది ..?తెలిదు కదా ...!
మరి అలాంటప్పుడు ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి బైక్ మిద వెళ్తున్నపుడు వాళ్ళ గురించి ఎందుకు తప్పుగా ఆలోచించాలి..? ఇలా అలోచంచడం ఎంత వరకు సరి అయినది ..?
అల జంటగా ఉన్నంత  మాత్రాన వారి గురించి మనం వాగడం అవసరమంటారా ..?
 సరదాగా అనుకునే మాటలు ఐన సరే అవి ఎంత చండాలంగా ఉంటాయో ఇక చెప్పాల్సిన  అవసరం లేదు అనుకుంటా ..?
అలా అనుకునే అప్పుడు మనం కూడా మన అక్క చేల్లెల్తోనో వెళ్తూ ఉంటె మన గురించి కూడా అవతలి వాళ్ళు  ఇలానే అనుకుంటారేమో అని ఇలా ఆలోచించడం తప్పు కదా అని ఒక్క సరి మన బుర్రలో తడితే చాలు అలా  అనుకోవడం ఎంత పాపమో మనకే తెలుస్తుంది..
వాళ్ళు ఉన్న చనువు తప్పుగా ఉంటే పరవాలేదు.. అనుకోండి మన దోల తీరేదాక ..!
కాని యెర్ర చీర కట్టిందల్ల నా పెళ్ళామే అని అన్నట్టు అలా  కలిసి ఉన్న అమ్మాయి అబ్బాయిలు అందరు అదే టైప్ అని మాత్రం అనుకోకండి సుమా.........!!!!!
నేను చెప్పింది సరి అయినదే అని అనుకుంటారని భావిస్తూ .......
                                                                        మీ
                                                                      చందు ... 

తస్మాత్ జాగ్రత్త...!!


Saturday 1 December 2012

మనసా పలుకవే ! నా కవిత్వమై నీవిలా....!


...నేనొక  ఒంటరిని నీ తోడు లేకపోతె..
అర్తం లేని జీవం నాది  నీ ప్రేమ ధక్కకుంటే....


అల్లరంటే  తెలియదు నిన్ను కలిసేదాక ..
నిజమైన అందమంటే తెలియదు నిన్ను చూసేదాకా 
ప్రేమ అంటే ఏమిటో తెలియదు నీ ప్రేమలో మునిగేదాక 

హ్మ్మ్..! ఇది నా జీవితం

నా  జీవితం గమ్యం లేని ఒక ప్రయాణం  
నా మనస్సు పనికి రాని ఒక  చెత్త బుట్ట 
నా మెదడు ఒక  అవసరం లేని పిచ్చి మొక్క 
నా   తనువు అనవసరంగా  నన్ను కప్పి  ఉంచిన ఒక మాసిన దుప్పటి ...!


అనుకున్న దారి  వేరు ..
 వెళ్తున్న చోటు వేరు 
 చివరగా  నా  గమ్యం ఎటువైపో మరి...?


  
అదృష్టం తలుపు  తట్టినా 
తెరవడానికి  చేతులు రాని  జీవం నాది ..!


కావాల్సిన దానికి వెతుకులాట 
         కానీ 
దోరుకునది  మాత్రం సన్నని  పిల్ల బాట..!


వికసించిన  పుష్పం అనుకున్న నా  జీవితం 
మధ్యలోనే రాలిపోనుందా  ......?
అర్తం లేని సందేహం అవసరమా నాకు ఈ దేహం ...?


నేడు బ్రతుకంత  జాగారం 
చివరగా  బ్రతుకే జాగారమా ...?


అనుకోని ఒడిదుడుకుల  మద్య 
 అనుకున్నది ఒడిచేరునా ...?
 ఆశ  పడునది దొరుకునా
చివరికి అన్వేషణ సాగునా ....?


మార్చాలని  అనుకున్న పరిస్థితికి 
నేనే  భానిస అవదునా ...............?


 మమతల  కోవెల లో  ఉన్న నేను 
చివరగా చేరునది  కాకి గుడునేనా  ....?



  తీరని దాహం నాది..
  .......తీర్చే నది ఏది ....?

                                        మీ  చందు....!! 


Friday 30 November 2012

నేనూ బ్లాగుతున్నానంటే నమ్మలేక పోతున్నా...!

హెల్లో.. హెల్లో..బ్లాగ్‌ టెస్టింగ్‌...100..99...98... ...

 మొదటిసారి ఒక బ్లాగ్‌ చూశాను. దీని వల్ల ఉపయోగం ఏంటా..? అన్న ప్రశ్న మొదలైంది... చిన్నగా గూగుల్లో సెర్చాను.... మొదట ఫేస్‌బుక్‌, అర్క్యూట్‌ లాగానేమో అనుకున్నా... నేను ఓ బ్లాగ్‌ తయారు చేస్తే పోలా అని ఒక్కో స్టెప్‌  కంప్లీట్ చెస్తూ  .. వచ్చాను... చివరగా బ్లాగ్‌ తయారైంది.. పేరు ఏం పెట్టాలి.. ఎప్పుడు నేనింతే అంతా చేసి ఆలోచిస్తా.... హా... తట్టింది...'నేనింతే' పేరు పెడితే పోలా.... కానీ రవితేజ ఫీలవుతాడేమో అనుకున్నా... ఎవరేమనుకుంటేనేం... నేనింతే.. అనుకున్నా పేరు పెట్టేసా.. ఇప్పుడు రోజుకి ఒకటి రెండు  పోస్టులు రాద్దామని డిసైడ్‌ అయ్యాను... కాబట్టి ఫ్రెండ్స్‌... బ్లాగ్లోకానికి నేను న్యూ కమర్‌.. so.... ఏం బ్లాగినా..
మీ సలహాలు... సూచనలతో కొంచెం హెల్ప్ చేయండే.....

ur's

Chandu..

ఇదేనా..మన భారతం.....?


స్వాతంత్ర్యం..
ఈ ఒక్క పదం  వింటే చాలు నిజమైన దేశభక్తుడికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. రోమాలు నిక్కబోడుచుకుంటాయ్... 200 ఏళ్ల దాస్య శృంకలాలను బద్దల గొట్టి భారతమాతకు విముక్తి కలిగించిన అమరవీరుల త్యాగాలు.. బలిదానాలు కళ్ళ ముందు కదలాడుతాయ్.


కానీ  ఇప్పుడు దేశ భక్తి ... క్రికెట్ స్టేడియాల్లో ఫోర్ కొట్టగానే  కేరింతలు కొడుతూ ఊపే  జెండాలుగానో.. లేక మొబైల్ ఫోనేస్లో వాల్ పేపర్స్ గానో కనిపిస్తోంది.
మన దేశం లో ఎన్నో మతాలు  కులాలు ఉన్నయి  వారి వారి మతాలకు సంబంధించిన పండగలను    గొప్పగా జరుపుకుంటారు.. ఈ భారతదేశం మొత్తం గర్వించ  దగ్గ  మన స్వాతంత్ర్య  పండగ ఎంత మంది జరుపుకుంటున్నారు.
దాస్య శృంకలాలని తెంపివేసిన మన సమరయోదులని  ఎన్ని సార్లు గుర్తుకు తెచ్చుకుంటున్నాం ???
ఒక మతానికి సంబంధించిన పండగ,ఒక కులానికి సంబంధించిన పండగని ఎంతో మంది కల్సి మరీ  జరుపుకుంటూ కలిసి ఉంటున్నారు ..తప్పు లేదు ... కాని ఈ స్వాతంత్ర్యం అనే పండగ మాత్రం జరుపుకోవటం కి ఎందుకు బద్దగిస్తున్నారు?
 చెప్పాలంటే   ఉదాహరణకి ..మా కాలేజీ..హ్మ్మ్.... మా ఒక్క కాలేజీ ఏంటి  హైదరాబాద్ లో ఉన్న సగం కాలేజీలలో..ఎంత మంది యువత ఆగష్టు 15న  కాలేజీకి  వస్తున్నారు .....?
కాలేజీ కి  ఆ ఒక్క రోజైన వస్తే వాళ్ల  సొమ్ము ఏమైనా  పోతుందా ....?
స్వాతంత్ర్యాని  ఎంజాయ్ చేస్తారు కానీ ఆ స్వేచ్చను మనకు ఇస్తున్న స్వాతంత్ర దినోత్సవాన్ని  జరుపుకోడానికి మాత్రం వెనక అడుగు  వేస్తారు ఇది మన నేటి యువత ...యువత ఏంటీ  ...?ఇదీ మన భారతం...

"ఇది స్కూల్ పిల్లలు చాక్లెట్లు పంచుకునే పండగలా  మిగిలిపోకూడదు" సర్వమత సమ్మేళనంగా ప్రతి ఒక్క భారతీయుడు "మేరా భారా భారత్  మహాన్" అంటూ నినదించి.. ప్రపంచమంతా విస్తుపోయేలా విశ్వ వినువీదులలో మువ్వన్నెల జెండా రేపరేపలాడించాలని.. ఆకాంక్షిస్తూ..! 

మీ...
చందు 

   

Saturday 24 November 2012

That iS nOn otHer thaN chAndu.... cHanDraKanTh....

చిరునవ్వుల 'చందు'రుడు
కోటి సూర్యుల  'కాంతు'డు
Separate style..
Mercy mannerism...!!


That iS nOn otHer thaN chAndu.... cHanDraKanTh..!!