Friday 30 November 2012

నేనూ బ్లాగుతున్నానంటే నమ్మలేక పోతున్నా...!

హెల్లో.. హెల్లో..బ్లాగ్‌ టెస్టింగ్‌...100..99...98... ...

 మొదటిసారి ఒక బ్లాగ్‌ చూశాను. దీని వల్ల ఉపయోగం ఏంటా..? అన్న ప్రశ్న మొదలైంది... చిన్నగా గూగుల్లో సెర్చాను.... మొదట ఫేస్‌బుక్‌, అర్క్యూట్‌ లాగానేమో అనుకున్నా... నేను ఓ బ్లాగ్‌ తయారు చేస్తే పోలా అని ఒక్కో స్టెప్‌  కంప్లీట్ చెస్తూ  .. వచ్చాను... చివరగా బ్లాగ్‌ తయారైంది.. పేరు ఏం పెట్టాలి.. ఎప్పుడు నేనింతే అంతా చేసి ఆలోచిస్తా.... హా... తట్టింది...'నేనింతే' పేరు పెడితే పోలా.... కానీ రవితేజ ఫీలవుతాడేమో అనుకున్నా... ఎవరేమనుకుంటేనేం... నేనింతే.. అనుకున్నా పేరు పెట్టేసా.. ఇప్పుడు రోజుకి ఒకటి రెండు  పోస్టులు రాద్దామని డిసైడ్‌ అయ్యాను... కాబట్టి ఫ్రెండ్స్‌... బ్లాగ్లోకానికి నేను న్యూ కమర్‌.. so.... ఏం బ్లాగినా..
మీ సలహాలు... సూచనలతో కొంచెం హెల్ప్ చేయండే.....

ur's

Chandu..

ఇదేనా..మన భారతం.....?


స్వాతంత్ర్యం..
ఈ ఒక్క పదం  వింటే చాలు నిజమైన దేశభక్తుడికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. రోమాలు నిక్కబోడుచుకుంటాయ్... 200 ఏళ్ల దాస్య శృంకలాలను బద్దల గొట్టి భారతమాతకు విముక్తి కలిగించిన అమరవీరుల త్యాగాలు.. బలిదానాలు కళ్ళ ముందు కదలాడుతాయ్.


కానీ  ఇప్పుడు దేశ భక్తి ... క్రికెట్ స్టేడియాల్లో ఫోర్ కొట్టగానే  కేరింతలు కొడుతూ ఊపే  జెండాలుగానో.. లేక మొబైల్ ఫోనేస్లో వాల్ పేపర్స్ గానో కనిపిస్తోంది.
మన దేశం లో ఎన్నో మతాలు  కులాలు ఉన్నయి  వారి వారి మతాలకు సంబంధించిన పండగలను    గొప్పగా జరుపుకుంటారు.. ఈ భారతదేశం మొత్తం గర్వించ  దగ్గ  మన స్వాతంత్ర్య  పండగ ఎంత మంది జరుపుకుంటున్నారు.
దాస్య శృంకలాలని తెంపివేసిన మన సమరయోదులని  ఎన్ని సార్లు గుర్తుకు తెచ్చుకుంటున్నాం ???
ఒక మతానికి సంబంధించిన పండగ,ఒక కులానికి సంబంధించిన పండగని ఎంతో మంది కల్సి మరీ  జరుపుకుంటూ కలిసి ఉంటున్నారు ..తప్పు లేదు ... కాని ఈ స్వాతంత్ర్యం అనే పండగ మాత్రం జరుపుకోవటం కి ఎందుకు బద్దగిస్తున్నారు?
 చెప్పాలంటే   ఉదాహరణకి ..మా కాలేజీ..హ్మ్మ్.... మా ఒక్క కాలేజీ ఏంటి  హైదరాబాద్ లో ఉన్న సగం కాలేజీలలో..ఎంత మంది యువత ఆగష్టు 15న  కాలేజీకి  వస్తున్నారు .....?
కాలేజీ కి  ఆ ఒక్క రోజైన వస్తే వాళ్ల  సొమ్ము ఏమైనా  పోతుందా ....?
స్వాతంత్ర్యాని  ఎంజాయ్ చేస్తారు కానీ ఆ స్వేచ్చను మనకు ఇస్తున్న స్వాతంత్ర దినోత్సవాన్ని  జరుపుకోడానికి మాత్రం వెనక అడుగు  వేస్తారు ఇది మన నేటి యువత ...యువత ఏంటీ  ...?ఇదీ మన భారతం...

"ఇది స్కూల్ పిల్లలు చాక్లెట్లు పంచుకునే పండగలా  మిగిలిపోకూడదు" సర్వమత సమ్మేళనంగా ప్రతి ఒక్క భారతీయుడు "మేరా భారా భారత్  మహాన్" అంటూ నినదించి.. ప్రపంచమంతా విస్తుపోయేలా విశ్వ వినువీదులలో మువ్వన్నెల జెండా రేపరేపలాడించాలని.. ఆకాంక్షిస్తూ..! 

మీ...
చందు 

   

Saturday 24 November 2012

That iS nOn otHer thaN chAndu.... cHanDraKanTh....

చిరునవ్వుల 'చందు'రుడు
కోటి సూర్యుల  'కాంతు'డు
Separate style..
Mercy mannerism...!!


That iS nOn otHer thaN chAndu.... cHanDraKanTh..!!


Friday 23 November 2012

ఇదేనేమో ప్రేమంటే....?

ఇదేనేమో ప్రేమంటే....?

నిన్ను చూడాలని  నా  కళ్ళు ఆరాట పడిన ప్రతి సారి నీ   స్పర్శ తగలాలని నా తనువు  ఆరాట  పడిన ప్రతిసారి
నా మనస్సు ఉక్కిరి బిక్కిరి ఐన ప్రతి క్షణాలు
 ఇప్పటికి నా  మనసులో కేరింతలు కొడ్తున్నాయి ..
ఏమిటి చెలియా నీలోని మాయ ....





 నువ్వు లేకుండా నేను చాల సంతోషంగా  ఉంటాను..
 నిన్ను వదిలి నేను ప్రశాంతం ఐన జీవనం సాగిస్తాను..
 నీవు మాట్లాడిన ప్రతిసారి మనసు బారం చేస్కుని వింటాను..
 ఎందుకు నా మనసు నీకు ఇచ్చానా అని   అనుక్షణం బాధ పడతు ఉంటాను...
అసలు నీవు నా జీవితం లోకి   రావడమే నేను దురదృష్టంగా  బావిస్తున్నాను..
"నా మనస్సు  చంపుకుని మరీ  రాస్తున్న ఈ  అసత్యాలు ఎంత నరకమో నేనైతే  చెప్పలేను...."






  ఎడారిల ఉన్న నా  హృదయం యందలికి.. వర్షపు చినుకులు కురిపించి
ఎడారిని సైతం ఒక హిమాలయం గ మర్చవాచు అని నిరూపించిన నా చెలి కి జోహార్ ...

Thursday 22 November 2012

నా మైండ్ లోని థాట్స్

హలో నేను చందు
నా మైండ్ లోని థాట్స్ .... మనసులోని ఫీలింగ్స్..... కలిపితే... ఈ బ్లాగ్ ...
Chandu time start's now....!!!