Friday 30 November 2012

ఇదేనా..మన భారతం.....?


స్వాతంత్ర్యం..
ఈ ఒక్క పదం  వింటే చాలు నిజమైన దేశభక్తుడికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. రోమాలు నిక్కబోడుచుకుంటాయ్... 200 ఏళ్ల దాస్య శృంకలాలను బద్దల గొట్టి భారతమాతకు విముక్తి కలిగించిన అమరవీరుల త్యాగాలు.. బలిదానాలు కళ్ళ ముందు కదలాడుతాయ్.


కానీ  ఇప్పుడు దేశ భక్తి ... క్రికెట్ స్టేడియాల్లో ఫోర్ కొట్టగానే  కేరింతలు కొడుతూ ఊపే  జెండాలుగానో.. లేక మొబైల్ ఫోనేస్లో వాల్ పేపర్స్ గానో కనిపిస్తోంది.
మన దేశం లో ఎన్నో మతాలు  కులాలు ఉన్నయి  వారి వారి మతాలకు సంబంధించిన పండగలను    గొప్పగా జరుపుకుంటారు.. ఈ భారతదేశం మొత్తం గర్వించ  దగ్గ  మన స్వాతంత్ర్య  పండగ ఎంత మంది జరుపుకుంటున్నారు.
దాస్య శృంకలాలని తెంపివేసిన మన సమరయోదులని  ఎన్ని సార్లు గుర్తుకు తెచ్చుకుంటున్నాం ???
ఒక మతానికి సంబంధించిన పండగ,ఒక కులానికి సంబంధించిన పండగని ఎంతో మంది కల్సి మరీ  జరుపుకుంటూ కలిసి ఉంటున్నారు ..తప్పు లేదు ... కాని ఈ స్వాతంత్ర్యం అనే పండగ మాత్రం జరుపుకోవటం కి ఎందుకు బద్దగిస్తున్నారు?
 చెప్పాలంటే   ఉదాహరణకి ..మా కాలేజీ..హ్మ్మ్.... మా ఒక్క కాలేజీ ఏంటి  హైదరాబాద్ లో ఉన్న సగం కాలేజీలలో..ఎంత మంది యువత ఆగష్టు 15న  కాలేజీకి  వస్తున్నారు .....?
కాలేజీ కి  ఆ ఒక్క రోజైన వస్తే వాళ్ల  సొమ్ము ఏమైనా  పోతుందా ....?
స్వాతంత్ర్యాని  ఎంజాయ్ చేస్తారు కానీ ఆ స్వేచ్చను మనకు ఇస్తున్న స్వాతంత్ర దినోత్సవాన్ని  జరుపుకోడానికి మాత్రం వెనక అడుగు  వేస్తారు ఇది మన నేటి యువత ...యువత ఏంటీ  ...?ఇదీ మన భారతం...

"ఇది స్కూల్ పిల్లలు చాక్లెట్లు పంచుకునే పండగలా  మిగిలిపోకూడదు" సర్వమత సమ్మేళనంగా ప్రతి ఒక్క భారతీయుడు "మేరా భారా భారత్  మహాన్" అంటూ నినదించి.. ప్రపంచమంతా విస్తుపోయేలా విశ్వ వినువీదులలో మువ్వన్నెల జెండా రేపరేపలాడించాలని.. ఆకాంక్షిస్తూ..! 

మీ...
చందు 

   

No comments:

Post a Comment